Monday, June 10, 2013

కానరాని అందం.

కనులకు కనుపడని ఆ రూపం,
మనసును హత్తుకునే ఆ గుణరూపం,
ఏ దివిలో దాగెనో ఆ చిలిపితనం,
నే కోరిన ఆ దివ్య రూపం.

వేచాను నీకై అహర్నిశం,
నీ దర్శనానికై చేశాను తపం,
కలలోనైనా మరవలేదే నీ జపం,
ఐనా కనులకు కానరాదే నీ దర్శనం??

రానే వచ్చెనే ఆ శుభసమయం,
ప్రాతః కాలమున ఆ దినం,
గంగా తీరాన ఆ కుసుమం,
మనో నేత్రములకు చేసెను ఆనందమయం.

భాస్కరుడే సింధూరము కాగా,
నీలి మేఘములే కనుబొమ్మలు కాగా,
పర్వత చరియలే కనురెప్పలు కాగా,
గిరి పుత్రియే(గంగా) నాసికము కాగా,
తీరాన కాషాయ వస్త్రాలే అదరములు కాగా,
సాక్షాత్కరించెను ఆ భువిజ కనుల పండుగగా...!!!

ఈ భువిలో్ దాగిన అందాలు ఎన్నో, మనసుతో చూడవోయ్,
ప్రకృతి అందాలన్నీ నీ ఎదుటే ఆవిష్కరమౌతాయి.
--(శంకర్)

1 comment: