Wednesday, February 13, 2013

తెలుగు వెలుగు

తేట తేట తెలుగు, తేనెలూరే తెలుగు,
అమ్మ పలుకు తెలుగు, నాన్న పాటం తెలుగు,
విన్న మొదటి మాట తెలుగు,
నెర్చిన మొదటి భాష తెలుగు.

తల్లి సంస్క్రుతాన్ని అనుకరించు భాష తెలుగు,
కవులను రంజింపు భాష తెలుగు,
రాయలు మెచ్చిన భాష తెలుగు,
కవిత్రయంబు ఆశ్రయించిన భాష తెలుగు.

జ్ఞాన భోదనకు వేమన సందించిన భాష తెలుగు,
కాకి అందాన్ని వర్నించు భాష తెలుగు,
కపిత్వమ్మును కవిత్వమ్ముగా మార్చు భాష తెలుగు,
ఆంధ్ర సంస్క్రుతిని ప్రతిభింభించు భాష తెలుగు.

రాటు తేలిన నాటు గేయం తెలుగు,
శిలను సైతం కరిగించు భాష తెలుగు,
ద్రవిడ భాషలందు ఒదుగు భాష తెలుగు,
సరళతకు రమ్యమైన పద సంపదకు నిర్వచనం తెలుగు.

ఇక ఏమని పొగిడెదు నీ భాషను, మనోభావ వ్యక్తీకరణకు, జ్ఞాన భోదనకు,
సాటి లేని భాషని రాయలు పొగడంగ,
కోరుకొనెద నీ భాష చిరకాలం ప్రకాశించవలె సూర్యచంద్రుల వెలుగు వోలె....


చిన్ననాటి నుండి మనం విద్యను అభ్యసించుటకు, భావాలను వ్యక్తపరుచుటకు మనకు తోడుగా నిలిచిన భాష నేడు ఉద్యోగ నెపంతో విద్యార్దులు, మార్కుల నెపంతో విద్యాలయాలు శిదిలావస్తకు చేరుస్తున్నారు. ఈ తరుణంలో తెలుగు భాష యొక్క కీర్తిని, తాను గడించిన వైభవాన్ని స్మరించి ఈ కమ్మనైన మాత్రు భాషను కాపాడుకొనుట మన ధర్మము.
(శంకర్)


భాషను కాపాడుకుందాం , మన సంస్కృతినీ కాపాడుకుందాం.