Wednesday, April 15, 2026

ఉల్లము : సంద్రము



ఘంబీరమైన అలజడితో సాగరఘోష
ఆలోచనల వలయంలొ మనోఘోష

నిత్యం ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఎగసి పడే కెరటాలు
నిత్యం కోరికల ఊసులలో ఉచ్చులు బిగుస్తూ సాగే ఆలోచనలు

తన గమ్యం తీరమని తెలిసినా తెలియని రీతిలో పరుగులు
తన గమనం కాష్టానికై యని ఎరిగినా ఎరగిని రీతిలో ఉరుకులు

కానవు అలల చాటునున్న నిశ్చల సాగరం
కానవు తలపుల మాటునున్న అచంచల స్వరూపం

అనుభవించరానిది రత్నగర్భం, ఆకాసానికై చూసే కెరటానికి
అనుభవించరానిది సూన్య ప్రకాశం, కోరికల ఉచ్చునున్న మనసుకు

గంగావతరణం



శివపురాణం అహాన్ని నాశనం చేయడానికి, ద్యానాన్ని భోదించటానికి తగిన ప్రతీతాత్మకమైన కథల సంపుటం అని ఓ నానుడి. మరి అందులో గంగావతరణం మనసుకి అన్వయించుకున్నప్పుడు ఇలా గోచరించింది.

సగర కుమారుల ఆత్మ విముక్తికై భగీరథుడు చేసిన ప్రయత్నం. ఇది గంగావతరనానికి నాంది.

భగీరథుడు తన మరియు తన పూర్వీకుల ఆత్మ విముక్తికై విలయ తాండవం చేసే కెరటాలతో, అంతులేని లోతులకు మింగేసే సుడిగుండాలతో నిండి ఉన్న గంగను భువికి రమ్మని ప్రార్దించాడు.

పూర్వీకులు పూర్వం చేసిన కర్మలకు నిదర్శనమైతే, ఆ పూర్వ కర్మల చేత ఉద్భవించిన తలపులు కెరటాలైన, ఆ భూత భవిష్యత్ తలంపుల సుడిగుండంలో మానవుడు వర్తమానము మరియు తన నిజ స్వరూపము నుండి విడువడి బ్రతుకు సారిస్తూ ఉంటాడు. ఇటు వంటి అరిషడ్వర్గాలతో కూడిన ఆలోచనల గుండంలో సతమతమవుతూ వాటి నుండి విముక్తి పొందటానికి, తనను తాను తెలుసుకొవటానికి ప్రయత్నము సలుపడు.

భగీరథుడు ఇంతటి ఊగ్రరూపాన ఉన్న గంగను శాంతింపచేసి భువికి దింపగల దిట్టయైన శివునికై తపము చేసి శివుని సాక్షాత్కరింప చేసుకున్నాడు.

నా ఆలోచన సరలిలో, ద్యానములో, తపములో నిమఘ్నుడైన వాడు ఆలొచనల కడలికి అతీతంగా తానే శివుడై నిశ్చలంగా, శాంతియుతంగా కేవలం దర్శనమాత్రుడై తనకు ఖేదం కలగక నిర్ణయము తీసుకొను ధీశాలిగా మారగలడు.

శివుడు తన జటాజూటాన ఆ నిలకడ యెరుగని గంగను బందించి సౌమ్య రీతిన, పాపాలను హరించు పాపనాసినిగా దివిపైకి చేర్చాడు. ఆ పిమ్మట గంగ తన స్పర్శతో సకల సగర వంశమునకు ముక్తిని ప్రసాదించింది.

తాను ద్యానము చేత నిలకడ లేని ఆలోచనలకు పగ్గం వేసి శాంతంగా సరైన నిర్ణయం తీసుకొనగలుగుతాడు. అటువంటి నిర్ణయాల చేత తాను తన పరివారానికి సంతోషదాయకంగా మారగలడు.

నేను నాకు అర్దమైన, నచ్చిన రీతిన కథలను అన్వయించుకున్నాను. మీరు ఈ కథను ఏ రీతిలో చూసారో మీరూ చెప్పగలరు.

ఇట్లు,
శంకర్

Monday, February 23, 2026

సాగర మధనం - ధ్యానం

 శివ

నిరాకార స్వరూపం
బ్రహ్మాండాన్న నాట్య విలాసం
లయ కారక విలయ తాండవం
మనో దృష్ట్యా మానస స్వరూపం

కానలేని ఆకారం
స్పృసించలేని పధార్దం
సర్వవ్యాప్తం నీ భావం
అచంచల మనసుకే నీ సాక్షాత్కారం

నిర్మానుష్యం నీ నివాసం
శభ్దరహితం నీ గమనం
శ్వాసనిశ్వాసల కేంద్రం నీ ఆలయం
నిను కాంచే మార్గం ధ్యానం

సాగర మధనం - ధ్యానం


పూర్వం దేవ దానవులు అమృతానికై సాగరాన్ని మధించారు, ఇదే సాగరమధనం. దీన్నే ధ్యానానికి అనుసంధానించి చూసినపుడు ఒక విచిత్రమైన పోలిక కనబడింది. ఆ వివరనే ఈ వ్యాసానికి మూల కారకం. ఇక విషయానికి వస్తే..

నిరంతరము ఆలొచనల తరంగాలతొ గొషితమై ఉండే మనసు ఓ సంద్రం. దేవ దానవులు మంచికి చెడుకి నిదర్శనాలు. వారు మంచి చెడు ఆలొచనల సమాహారం. వాటి మద్య నిత్యం జరిగే మధనం, సాగర మధనం.

లక్ష్యము, దిశ, స్థిరత్వము లేని మధనం నిరర్ధకం. మందర పర్వతం లాంటి దేహాన్ని కవ్వంగా, వాయుభక్షకుడైన వాసుకి వలె శ్వాస నిశ్వాసలను ఆదారం చేసుకొని, కూర్మము వంటి స్థిరమైన భంగిమతో, స్మారక స్థితిని పొందుటే లక్ష్యముగా చెసే మధనమే ధ్యానం.

మధనం జరుగు సమయములో రాపిడి వల్ల వాసుకి అనుభవించిన భాదె స్వాస నిస్వాసాల వల్ల మన హ్రుదయములొ కలిగె ఉష్ణ స్థితి(అనాహత చక్ర చైతన్యం). 

సాగర మధనంలో మొదట ఉద్భవించినది హలాహలం. హలాహలం మనలో కూరుకుపోయిన కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్య మరియు క్షుధా-తృష్ణలకు నిదర్శనాలు. వీటిని హృదయములో ఉంచిన యెడల మనుష్యునకు శాంతి దుర్లభం. అదే వీటిచే ప్రభావితుడై కార్యములు సలిపిన, ఆ కార్యములచే అశాంతి పొందుతాడు. కావున వీటిని గరల కంఠుడైన సదాశివునకి అర్పించి ఇటు హృదయము చలించకుండా అటు మనసు ఖేధపడక స్మారక స్థితిని పొందడమే ధ్యానం.

(అపస్మర - హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అజ్ఞానం మరియు అహంకారాన్ని సూచించే ఒక చిన్న వ్యక్తి. నటరాజ స్వరూపంలో శివుడి కాలి క్రింద ఈ అపస్మరుడను తన ఆదీనములో ఉంచుకుంటాడు.)


లక్ష్మీ దేవి సర్వ సంతోషాలకు కారణం. స్మారక స్థితిలో ఉన్న మనుష్యునకు సంతోషం కలుగుతుంది. తన కోరికల సాధనకు అనుకూలమైన విచారణను కలిగించు కామధేనువుని అనుగ్రహించేది ధ్యానం.

అమృతము స్మారక స్థితితో(consciousness) సమానము. ఏ విధముగా అయితే మోహిని మాయ చేత అసురులను మభ్య పరచి సురులకు అమృతాన్ని అందజేసి లోకానికి శాంతిని కలిగించిందో అదే విదంగా స్మారక స్థితిలో మనుష్యుడు తన చెడు ఆలోచనలను మాయలో కప్పివేస్తూ తన మంచి ఆలోచనలను వృద్ధి చేస్తూ తాను సంతుష్టుడై, తన పరివారాన్ని సంతోషంగా ఉంచగలడు.

ఇది వారణాసి నగరాన గంగా నదీ తీరాన నాకు కలిగిన అనుభూతి.

                                                                                                                                        -- శంకర్