శివ
బ్రహ్మాండాన్న నాట్య విలాసం
లయ కారక విలయ తాండవం
మనో దృష్ట్యా మానస స్వరూపం
స్పృసించలేని పధార్దం
సర్వవ్యాప్తం నీ భావం
అచంచల మనసుకే నీ సాక్షాత్కారం
శభ్దరహితం నీ గమనం
శ్వాసనిశ్వాసల కేంద్రం నీ ఆలయం
నిను కాంచే మార్గం ధ్యానం
సాగర మధనం - ధ్యానం
పూర్వం దేవ దానవులు అమృతానికై సాగరాన్ని మధించారు, ఇదే సాగరమధనం. దీన్నే ధ్యానానికి అనుసంధానించి చూసినపుడు ఒక విచిత్రమైన పోలిక కనబడింది. ఆ వివరనే ఈ వ్యాసానికి మూల కారకం. ఇక విషయానికి వస్తే..
నిరంతరము ఆలొచనల తరంగాలతొ గొషితమై ఉండే మనసు ఓ సంద్రం. దేవ దానవులు మంచికి చెడుకి నిదర్శనాలు. వారు మంచి చెడు ఆలొచనల సమాహారం. వాటి మద్య నిత్యం జరిగే మధనం, సాగర మధనం.
లక్ష్యము, దిశ, స్థిరత్వము లేని మధనం నిరర్ధకం. మందర పర్వతం లాంటి దేహాన్ని కవ్వంగా , స్వాస నిస్వాసలను వాసుకి యొక్క తలాతోకగా మలచి. కూర్మము వంటి స్థిరమైన భంగిమతో, స్మారక స్థితిని పొందుటే లక్ష్యముగా చెసే మధనమే ధ్యానం.
మధనం జరుగు సమయములో రాపిడి వల్ల వాసుకి అనుభవించిన భాదె స్వాస నిస్వాసాల వల్ల మన హ్రుదయములొ కలిగె ఉష్ణ స్థితి(అనాహత చక్ర చైతన్యం).
సాగర మధనంలో మొదట ఉద్భవించినది హలాహలం. హలాహలం మనలో కూరుకుపోయిన కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్య మరియు క్షుధా-తృష్ణలకు నిదర్శనాలు. వీటిని హృదయములో ఉంచిన యెడల మనుష్యునకు శాంతి దుర్లభం. అదే వీటిచే ప్రభావితుడై కార్యములు సలిపిన, ఆ కార్యములచే అశాంతి పొందుతాడు. కావున వీటిని గరల కంఠుడైన సదాశివునకి అర్పించి ఇటు హృదయము చలించకుండా అటు మనసు ఖేధపడక స్మారక స్థితిని పొందడమే ధ్యానం.
(అపస్మర - హిందూ పురాణాలలో ఆధ్యాత్మిక అజ్ఞానం మరియు అహంకారాన్ని సూచించే ఒక చిన్న వ్యక్తి. నటరాజ స్వరూపంలో శివుడి కాలి క్రింద ఈ అపస్మరుడను తన ఆదీనములో ఉంచుకుంటాడు.)
లక్ష్మీ దేవి సర్వ సంతోషాలకు కారణం. స్మారక స్థితిలో ఉన్న మనుష్యునకు సంతోషం కలుగుతుంది. తన కోరికల సాధనకు అనుకూలమైన విచారణను కలిగించు కామధేనువుని అనుగ్రహించేది ధ్యానం.
అమృతము స్మారక స్థితితో(consciousness) సమానము. ఏ విధముగా అయితే మోహిని మాయ చేత అసురులను మభ్య పరచి సురులకు అమృతాన్ని అందజేసి లోకానికి శాంతిని కలిగించిందో అదే విదంగా స్మారక స్థితిలో మనుష్యుడు తన చెదు ఆలోచనలను మాయలో కప్పివెస్తూ తన మంచి ఆలోచనలను వృద్ధి చేస్తూ తాను సంతుష్టుడై, తన పరివారాన్ని సంతోషంగా ఉంచగలడు.
వారణాసి నగరాన గంగా నదీ తీరాన నాకు కలిగిన భావాలను ఇక్కడ పంచుకున్నాను.
-- శంకర్


